ఏపీ సీఎం వైఎస్ జగన్ కు( CM Jagan ) రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు.జగన్ పాలనపై పాజిటివ్ ఒపీనియన్ ఏ స్థాయిలో ఉందో నెగిటివ్ ఒపీనియన్ సైతం అదే స్థాయిలో ఉంది.2024 ఎన్నికల్లో వైసీపీ ( YCP ) మళ్లీ అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్నకు ఎవరూ కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.అయితే మంత్రి రోజా( Minister Roja ) ఒక ఇంటర్వ్యూలో జగన్ ఆహారపు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
సీఎం జగన్ సార్ లా మనం తింటే మాత్రం జీరో సైజ్ లో ఉంటామని రోజా కామెంట్లు చేశారు.జగన్ ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడతారని ఆమె వెల్లడించారు.
నాన్ వెజ్ వారానికి ఒకసారి మాత్రమే ఆయన తింటారని కీమా ఇష్టంగా తింటారని రోజా పేర్కొన్నారు.సీఎం జగన్ పాదయాత్రకు నగరికి వచ్చిన సమయంలో ఈ విషయాలు తెలిశాయని రోజా వెల్లడించడం గమనార్హం.

లీటర్ పాలలో పచ్చి అల్లం వేసి మరగబెడితే ఒక గ్లాస్ అవుతుందని ఆ పాలను సీఎం జగన్ తాగుతారని రోజా చెప్పుకొచ్చారు.జగన్ సార్ కు చాలా స్ట్రెంత్ అని ఆమె అన్నారు.రోజా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు వైసీపీ బీజేపీ మధ్య గ్యాప్ ఏర్పడిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అమిత్ షా వైసీపీపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

2024 ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయో విఫలం అవుతాయో చూడాల్సి ఉంది.జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే 2024 ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో సైతం అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.







