సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.శనివారం సాయంత్రం ఆయన మరణ వార్త తెలుసుకొని సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
గుండెపోటుకు గురైన ఆయన బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో దాదాపు 23 రోజులపాటు చావుతో పోరాడి మృతి చెందడం జరిగింది.ఫిబ్రవరి 18వ తారీకు మరణించిన ఆయనను అదే రోజు రాత్రి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆయన స్వగృహానికి .పార్థివ దేహాన్ని తరలించారు.కాగా ఆదివారం ఉదయం నుండి సినీ రాజకీయ నేతలు నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

కాగా ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మోకీల గ్రామంలో తారకరత్న నివాసంలో వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడం జరిగింది.ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్యను షర్మిల ఓదార్చారు.ఇదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తోనూ మిగతా కుటుంబ సభ్యులతో షర్మిల మాట్లాడటం జరిగింది.రేపు అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిం ఛాంబర్ నందు తారకరత్న పార్థివ దేహం ఉంచనున్నారు.
అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.







