శ్రీరామ శోభయాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ప్రతినిధులు

శ్రీరామ శోభయాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ప్రతినిధులు తెలియజేశారు.హైద్రాబాద్, సిద్దేమ్బర్ బజార్ లోని బహేతి భవన్ లో భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షులు భాగవంత్ రావు,జనరల్ సెక్రెటరీ గోవింద్ రాతి,పలువురు సమితి నాయకులు పాల్గొన్నారు.

 Bhagyanagar Shri Rama Navami Festival Committee On Arrangements Of Shri Rama Sho-TeluguStop.com

ఈ సందర్భంగా భాగవంత్ రావు మాట్లాడుతూ… శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర 2010నుండి నిర్వహిస్తున్నామని,గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో శోభాయాత్ర నిర్వహించలేకపోయామని తెలియజేశారు.

ఈ సంవత్సరం ప్రభుత్వ సహకారంతో ఈనెల 10న సీతారాం బాగ్ నుండి మధ్యాహ్నం 1.30గంటలకు యాత్ర ప్రారంభం అయి సాయంత్రం హనుమాన్ వ్యాయమ శాల లో ముగించుకొని అనంతరం 10వేల మందితో భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుందని తెలియజేశారు.ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

భక్తులు శ్రీరాముని భక్తి పాటలు తప్ప సినిమా పాటలతో ఊరేగింపు చేయకూడదని బల్వంత్ రావు విజ్ఞప్తి చేశారు.

నగరం నలువైపుల నుండి 4 రూట్లలో శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

ప్రధాన శోభాయాత్ర మొదటి రూట్ సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడా కామన్, మంగల్ హాట్, జాలి హనుమాన్, దుల్పెట్,పురాణ ఫుల్ గాంధీ విగ్రహం, జమ్మరాత్ బజార్,చుడి బజార్,బేగంబజార్,సిద్దేమ్బర్ బజార్,గౌలిగూడా చెమాన్,రాం మందిర్,పుట్లీ బొలి,కోఠి ఆంధ్ర బాంక్,అనుమాన్ వ్యయమా శాల వరకు చేరుకుంటుంది.

Telugu Bhagavanth Rao, Bhagyanagar, Committee, Shrirama, Sri Rama, Telangana-Gen

రెండవ రూట్.అంబర్ పెట్ ప్లే గ్రౌండ్,6నెంబర్ రోడ్, తిలక్ నగర్,ఫీవర్ హాస్పిటల్,బర్కత్ పుర,కాచిగుడా,చందర్ ఘాట్,అనుమాన్ వ్యమశాల వరకు….3వ రూట్…జిఎస్ మల్కోట్ పార్క్,నారాయణ గూడా,కాచిగుడా క్రాస్ రాడ్,బడి చౌడి, సుల్తాన్ బజార్,హనుమాన్ వ్యాయమ శాల వరకు…4వ రూట్…ఖైరతాబాద్, హిమాయత్ నగర్,బషీర్భాగ్, హనుమాన్ వ్యాయామ శాల వరకు కొనసాగుతుందని తెలియజేశారు.శోభయాత్రలో శ్రీరాముని వేషాదరణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకోబోతున్నారని చెప్పారు.భక్తులు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్ర లో పాల్గొని భక్తి శ్రద్ధలతో కీర్తనలు చేస్తూ దేవుని ఆశీర్వాదం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube