తలనొప్పి( headache ).దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.
అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే రుగ్మతల్లో తలనొప్పి ముందు వరుసలో ఉంటుంది.మనం రోజు వారి ఎదుర్కొనే సాధారణ తలనొప్పికి ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలు.
అయితే తలనొప్పి రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్ వేసేసుకుంటూ ఉంటారు.ఇలా తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల దీర్ఘకాలికంగా అనేక జబ్బులు తలెత్తుతాయి.
అందుకే సాధారణ తలనొప్పిని మందులతో కాకుండా సహజంగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
అందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో ఉత్తమంగా తోడ్పడతాయి.
ముఖ్యంగా తలనొప్పిని తరిమి కొట్టడానికి మన వంట గదిలో ఉండే దాల్చిన చెక్క అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా దాల్చిన చెక్కను పొడి( Cinnamon powder ) మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడికి నాలుగైదు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నుదురుపై కాస్త మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా నుదురు ని క్లీన్ చేసుకోవాలి.దాల్చిన చెక్క తలనొప్పిని వదిలించుకోవడానికి సమర్థవంతమైన ఏజెంట్గా పని చేస్తుంది.పైన చెప్పిన విధంగా దాల్చిన చెక్కను వాడితే సాధారణ తలనొప్పి నుంచి క్షణాల్లో రిలీఫ్ పొందుతారు.అలాగే తలనొప్పిని తగ్గించడానికి కొన్ని కొన్ని పానీయాలు ఎంతో ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి.
ప్రధానంగా తలనొప్పి బాగా వస్తున్నప్పుడు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్( orange juice ) తీసుకోండి.ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు తలనొప్పిని ఇట్టే దూరం చేస్తాయి.ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తరిమికొట్టి మైండ్ రిఫ్రెష్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి.ఒకవేళ ఆరెంజ్ అందుబాటులో లేకపోతే గ్రేప్ జ్యూస్, లెమన్ వాటర్, జింజర్ టీ, గ్రీన్ టీ వంటి పానీయాలు కూడా తీసుకోవచ్చు.