ప్రస్తుతం భారతదేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.దీనివల్ల నేలపై సంచరించే పాములు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి.
వరద నీటికి, చలికి ఇబ్బందులు పడలేక అవి వెచ్చగా ఉన్న ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి.కొన్ని పాములు అయితే చెట్లెక్కేస్తున్నాయి.
తాజాగా ఒక 12 అడుగుల కింగ్ కోబ్రా( King Cobra ) ఒక చెట్టు ఎక్కింది.ఇది అడవుల్లో నుంచి గ్రామంలోకి వచ్చి చెట్టు పైకి ఎక్కి హాయిగా సేద తీరింది.
అంత పెద్ద పామును చూడగానే గ్రామస్తులు షాక్ అయ్యారు.వెంటనే పాములు పట్టే అధికారులకు సమాచారం అందించారు.
అగుంబె రెయిన్‌ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ( Agumbe Rainforest Research Station )(ARRS) డైరెక్టర్ అజయ్ గిరి ఈ 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాకు సంబంధించి ఒక వీడియోను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు.ఈ పాము కర్ణాటకలోని ఒక గ్రామంలోకి వచ్చింది.
గ్రామస్థులు అడవి అధికారులకు ఫోన్ చేసి, పాము వారి ఇంటి బయట ఒక పొదపై చుట్టుకుని ఉన్నట్లు తెలిపారు.అడవి అధికారులు వచ్చి పామును పట్టుకుని, అది మానవ నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న అడవిలో వదిలిపెట్టారు.
ఈ పాము మొదట ఒక ప్రధాన రహదారిని దాటుతూ కనిపించింది, ఆ తర్వాత ఒక ఇంటి ప్రాంగణంలోని ఒక పొదపై దాక్కుంది.వీడియోలో పాము ఆకులు, కొమ్మల మధ్య కదులుతూ కనిపించింది.ఈ దృశ్యం చూసేందుకు చాలా భయానకంగా ఉంది.రహదారి గుండా పాము పాకుతున్నప్పుడు జనాలు భయపెట్టి ఉంటారని అందుకే ఇది చెట్టు ఎక్కి ఉంటుందని అజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వీడియో ప్రారంభంలో, పాము మందపాటి శరీరం ఒక చెట్టు నుంచి వేలాడుతూ కనిపించింది.దాన్ని కిందకి దించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది భయంకరంగా, చురుగ్గా కదిలింది.రెస్క్యూ టీమ్ పామును ఎలా రక్షించి అడవిలో వదిలిపెట్టారో వీడియో చివరిలో చూపించారు.
వీడియోలో, అజయ్ పాము దృష్టిని తన వైపుకు మళ్లించాడు.తర్వాత చాలా జాగ్రత్తగా దానిని చెట్టు పై నుంచి కిందకి దించాడు.ఆ సమయంలో అతడి చేతిలో ఒక పొడవాటి స్టీల్ రాడ్ ఉంది.
పామును వారి చేపట్టకుండా చాలా ప్రశాంతంగా డీల్ చేశారు.పామును ఓ సంచిలోకి పంపించాలని ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు.
తర్వాత పామును మెల్లగా సంచిలోకి పంపించారు.పామును సురక్షితంగా పట్టుకున్న తర్వాత స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, రామలకు సంబంధించిన సమాచార పత్రాలను అందించారు.
ఆపై స్థానికుల ముందే పామును అడవిలో విడిచిపెట్టారు.