వయసు పెరగడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, శరీరానికి శ్రమ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడెక్ట్స్ ను యూస్ చేయడం వంటి అంశాలు చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి.ఈ క్రమంలోనే ముడతలు, స్కిన్ టోన్ తగ్గడం, పిగ్మెంటేషన్ తదితర సమస్యలు మదన పెడుతూ ఉంటాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఆయిల్‌ను నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుంటే ముడతలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు దూరం అవ్వడమే కాదు స్కిన్ టోన్ అద్భుతంగా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ ఆయిల్ ఏంటో.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు గులాబీ రేకలు, పది పుదీనా ఆకులు, పది తులసి ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు, ఒక నిమ్మపండు యొక్క తొక్కలు, కొన్ని ఆరెంజ్ పండు యొక్క తొక్కలు వేసి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి నూనెను పోయాలి.

ఈ నూనెలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై అందులో వన్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ అతిమధురం(ములేటి) పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
కంప్లీట్‌గా కూల్ అయిన అనంతరం పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకుంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు.ఇక రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో శుభ్రంగా కడిగి తడి లేకుండా టవల్‌తో తుడుచుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న ఆయిల్‌ను ముఖానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే ముడతలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.అదే సమయంలో స్కిన్ టోన్ చక్కగా పెరుగుతుంది.







