ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో వయసు పెరిగే వారిలో జ్ఞాపక శక్తి తగ్గడం వైద్యులు గమనిస్తున్నారు.అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలో బాదం పప్పు ఉండేలాగా చూసుకోవడం మంచిది.
ఇలాంటి బాదంపప్పును తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది.అంతేకాకుండా ఇందులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
బాదంపప్పు తినడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉండడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది.శరీరంలో బలహీనతను కూడా ఈ బాదంపప్పు తగ్గిస్తుంది.శరీరం శక్తివంతంగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది.
బాదంలో ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు, అసంతృప్త కొవ్వులు ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

బాదంలో లిపిడ్లు, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి.ఇవి బ్యూటిరేట్ ఉత్పత్తిని పెంచేందుకు తోడ్పడతాయి.అంతేకాకుండా బాదం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బాదం పప్పులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది.ప్రతిరోజు నీటిలో నాన్న పెట్టిన బాదంపప్పును ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తింటే చాలా అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
ఉదయం పూట ఖాళీ కడుపుతో బాదంపప్పు తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇది శరీరంలోని వాపును కూడా తగ్గిస్తుంది.
ఇవే కాకుండా ఇంకా చాలా అనారోగ్య సమస్యలు ఉదయం పూట ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం తినడం వల్ల దూరం అవుతాయి.