రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో( Ajmer, Rajasthan ) ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
కారణం ఏమిటంటేz రద్దీగా ఉండే మార్కెట్‌లో కాళ్లు బాగా దెబ్బతిన్న ఒక వ్యక్తి కూర్చొని అడుక్కుంటున్నాడు.అయితే అందరి కళ్లూ అతని చేతిలో ఉన్న ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై( iPhone 16 Pro Max ) పడ్డాయి.
దాదాపు రూ.1.5 లక్షలు విలువ చేసే ఈ ఫోన్‌ను తాను పూర్తిగా క్యాష్ ఇచ్చి కొన్నానని ఆ వ్యక్తి చెప్పడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సెప్టెంబర్‌లో విడుదలైంది.యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో దీని ధర రూ.1,44,900గా ఉంది.యాపిల్ లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ ఫోన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.రోహిత్ ఇన్ఫార్మ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు “అడుక్కునే వ్యక్తి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌తో.
ఫుల్ పేమెంట్ చేశాను, ఈఎంఐ కాదు అంటున్నాడు” అనే క్యాప్షన్ ఇచ్చారు.ఒక వ్యక్తి అతన్ని అంత ఖరీదైన ఫోన్ ఎలా కొన్నావ్ అని అడిగినప్పుడు, ఆ వ్యక్తి “మాంగ్ కే” (అడుక్కొని) అని సమాధానమిచ్చాడు.
ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలామంది ఆశ్చర్యం, ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు ఆ వ్యక్తి అంత ఖరీదైన ఫోన్ కొనగలగడంపై నమ్మలేకపోతున్నారు.మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తూ, చాలా ఉద్యోగాల కంటే అడుక్కోవడమే మంచి “వ్యాపారం” అని, దీనికి “పెట్టుబడి లేదు, ఒత్తిడి లేదు, కానీ రాబడి మాత్రం ఎక్కువ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇతరులు ఈ విచిత్రమైన పరిస్థితిపై జోకులు పేలుస్తున్నారు.ఒక యూజర్ “మధ్యతరగతి కంటే భిక్షగాళ్లే బాగా సంపాదిస్తున్నారు” అని కామెంట్ చేయగా, మరొకరు “బహుశా మనం కూడా భిక్షగాళ్లుగా మారిపోవాలేమో” అని సలహా ఇస్తున్నారు.కొందరు ఈ పరిస్థితిలోని వ్యంగ్యాన్ని విమర్శిస్తూ, “భిక్షగాళ్లకు కూడా పన్నుల బాధలు లేవు” అని అంటున్నారు.ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
పేదరికం, విలాసానికి మధ్య ఉన్న ఈ ఊహించని సంబంధం అందరినీ ఆలోచనలో పడేస్తోంది.