సినిమా.అంటే మూడు అక్షరాల మాట మాత్రమే కాదు.ముక్కంటి కూడా ఉహించలేని ఓ మాయా ప్రపంచం.ఇక్కడ… ఎప్పుడు, ఎవరికి., ఎలాంటి అవకాశాలు వస్తాయో చెప్పలేము.ఆ తరువాత కాలంలో ఎవరు ఎంత గొప్పగా ఎదుగుతారో కూడా ఊహించలేము.ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు., కాస్త వయసు రాగానే సూపర్ స్టార్ లు అయిపోతుంటారు.
మహేష్ బాబు, తరుణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్ని, అఖిల్ .ఇలా వీరంతా చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించినవారే .అలానే రాశి, మీనా, హన్సిక, షాలిని, లయ వంటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆ తర్వాత హీరోయిన్స్ గా సత్తా చాటుతున్నారు.
కానీ.
, మీకు తెలుసా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ రాశి ఒక సినిమాలో కలసి నటించారు.అది కూడా.
వీరిద్దరూ అన్న, చెల్లెల్లుగా నటించారంటే ఆశ్చర్యపోక తప్పదు.ఆ రోజుల్లో హీరో బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటే మాములు సూపర్ హిట్ కాంబినేషన్ కాదు.
అలా వీరిద్దరి కాంబినేషన్ వరుసగా 6.వంద రోజులు ఆడిన చిత్రాలు విడుదల అయ్యాయి.ఆ ఫ్లోలో విడుదలైన చిత్రమే బాల గోపాలుడు.కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చినా ఈ చిత్రం లో నటి సుహాసిని హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు గాను కళ్యాణ్ రామ్, రాశిలు ఇద్దరు కూడా బాలనటులుగా నటించారు.
ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర పేరు రాజా.రాశి పాత్ర పేరు లక్ష్మీ.ఇందులో వీరిద్దరూ ఆనాధలు.కథలో భాగంగా బాలకృష్ణ వీరిని చేరదీసి ఆశ్రమం కలిపిస్తాడు.
కళ్యాణ్ రామ్ మరియు రాశి హీరో హీరోయిన్స్ గా

నిజానికి ఇది పక్కా కమర్షియల్ మూవీనే అయినా., ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలకి మంచి పేరు వచ్చింది.కానీ., బాలనటుడిగా కళ్యాణ్ రామ్ కూడా మంచి పేరు వచ్చింది.కానీ ఏ కారణం చేతనో కళ్యాణ్ రామ్ మారె సినిమాలోనూ బాలనటుగా మల్లి నటించలేదు.కానీ నటి రాశి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో దుమ్ము రేపేసింది.
దీనితో., ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కళ్యాణ్ రామ్, రాశిల నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ మల్లి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయకపోయినా., రాశి మాత్రం బాల గోపాలుడు సినిమా తర్వాత ఆదిత్య 369, అంకురం, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో బాల నటిగా నటించింది.
ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా మెరిసింది.తరువాత కాలంలో ఇక హీరోయిన్ గా రాశి టాప్ రేంజ్ కి దూసుకెళ్లింది.
ఇక రాశీ హీరోయిన్ అయ్యాక.ఎన్నో ఏళ్ళకి కళ్యాణ్ రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు కూడా కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.రాశీ మాత్రం కెరీర్ లో ఒకసారి బ్రేక్ ఇచ్చి.
, ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఇప్పుడు ఆమె తన స్థాయి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
మరి., రానున్న కాలంలో వీరిద్దరూ ఒకే మూవీ కలసి నటిస్తారేమో చూడాలి.