తెలుగు చలన చిత్ర సీమలో అప్పట్లో వ్యాంపు పాత్రలు చేయడానికి సెపరేట్ గా కొందరు ఆర్టిస్టులు ఉండేవారు.వాళ్ళల్లో సిల్క్ స్మిత లాంటి వాళ్ళు ముందు ఉండేవారు.
వీళ్లలా కాకపోయినా వ్యాంపు క్యారెక్టర్స్ చేసినవాళ్లు కొందరు ఉన్నారు.మంజుభార్గవి అనే పేరు అందరికి తెలియకపోవచ్చు కానీ శంకరాభరణం సినిమా చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.
ఆవిడా సిని ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం…
మంజు భార్గవి అసలు పేరు మంజుల స్క్రీన్ నేమ్ గా మంజు భార్గవి అని పెట్టుకున్నారు.అయితే ఆవిడ కి మొదటి నుంచి శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టం.
చిన్నప్పటి నుండే కూచిపూడి, భరతనాట్యం అన్ని నేర్చుకొని స్టేజి షో లు ఇస్తుండేవారు.ఒకరోజు ఆమె డాన్స్ షో చూసిన ప్రకాష్ గారు ఆమెని గాలిపటాలు సినిమాలో తీసుకున్నారు అది ఆమెకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
తర్వాత మంజు భార్గవి గారిని ఒక షోలో K.విశ్వనాధ్ గారు చూసి ప్రెసిడెంట్ పేరయ్య సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.
అప్పటి వరకు కొన్ని వ్యాంపు క్యారెక్టర్స్ చేసిన మంజు భార్గవి గారికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు.మంజు భార్గవి వాయిస్ లో బేస్ ఉండడం వల్ల ఆమె పాత్ర కి డబ్బింగ్ ఆమెనే చెప్పుకునేది కాదట.
ప్రెసిడెంట్ పేరయ్య మూవీలో విశ్వనాధ్ గారు మంజు భార్గవి గారిని పిలిపించి తానే దగ్గరుండి మరి డబ్బింగ్ చెప్పించారట తర్వాత తనది ఒక ఫోటో కావాలి అంటే అప్పటికి అప్పుడు ఆమె ఫోటో స్టూడియో కి వెళ్లి ఒక ఫోటో దిగి తీసుకువచ్చి ఇచ్చిందట.తర్వాత కొన్ని రోజులకి మంజుభార్గవి గారితో డాన్స్ ప్రధానమైన సినిమా ఒకటి చేస్తున్నాను అని విశ్వనాథ్ గారు అనౌన్స్ చేయడం తో చాల మంది ఈ వ్యాంపు క్యారెక్టర్స్ చేసే ఆమెతో డాన్స్ సినిమా ఏంటి అని అందరు అనుకున్నారట.కానీ విశ్వనాధ్ గారు అవేమి పట్టించుకోకుండా సినిమా తీసి హిట్టు కొట్టారు, మాములు హిట్ కాదు అది ఒక క్లాసికల్ గా చరిత్రలో నిలిచిపోయింది.మంజుభార్గవి గారు తర్వాత తమిళ్, మలయాళం లో సినిమాలు చేసారు.
కానీ మంజు భార్గవి గారికి శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం కానీ అసలు సినిమా అంటే ఇష్టం లేనేలేదట, అందుకే ఆమె తర్వాత కూడా ఎక్కువ సినిమాలు చేయలేదని ఆమె చెప్తారు.అయితే సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడానికి తన హైట్ కూడా ఒక కారణం అని చాలామంది అంటుంటారు.ఆవిడ తర్వాత అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చేసారు.కృష్ణ వంశీ డైరెక్టర్ గా నాగార్జున హీరోగా వచ్చిన నిన్నేపెళ్లాడుతా మూవీలో హీరోయిన్ టబు గారి అమ్మగా యాక్ట్ చేసారు ఆ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.
ఇక కమెడియన్ అలీని హీరోగా పెట్టి డైరెక్టర్ S.V కృష్ణారెడ్డి తీసిన యమలీల సినిమాలో అలీ తల్లిగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది తను…
ప్రస్తుతం మంజుభార్గవి బెంగుళూర్ లో ఒక శాస్త్రీయ నృత్యం నేర్పే ఒక డాన్స్ స్కూల్ పెట్టి అది చూసుకుంటున్నారు.
తనకి చనిపోయేంతవరకు డాన్స్ అంటే ఇష్టం అని ఇప్పటికి ప్రదర్శనలు ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నానని చెప్తుంది.అయితే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూ వీళ్ల గురువు గారి దగ్గర ఉన్నపుడు కొన్ని నాటకాలు కూడా వేసేవారట మంజు గారు హైట్ గా ఉండడం వల్ల ఎప్పుడు తనే కృష్ణుడి వేషం,విష్ణువు వేషం వేసేదని వల్ల బ్యాచ్ లో ఉన్న వాళ్ళని బాగా ఏడిపించేదని కూడా తాను చెప్తుంది.
యమలీల షూటింగ్ చేస్తున్నపుడు తన క్యారెక్టర్ కి కావాల్సిన బంగారు నగలు తనే ఇంటి దగ్గరినుంచి వేసుకొని వచ్చేదట.ఇక వ్యాంపు పాత్రలో నర్తించడం వాళ్ళ ఆమె తన సినిమా జీవితాన్ని కోల్పోయానని అప్పుడప్పుడు ఆవేదన చెందుతారట.
ఇది మంజుభార్గవి గారి స్టోరీ చూద్దాం మళ్ళీ ఆమె వెండితెరపై కనిపిస్తారు లేదో…
.