అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తన కేబినెట్‌ను నిర్మించుకుంటూ వెళ్తున్నారు.ఇప్పటికే కీలక శాఖలకు , విభాగాలకు నియామకాలు పూర్తి చేసిన ఆయన.
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి పూర్తి స్థాయి కేబినెట్‌ను సిద్ధం చేయాలనే యోచనలో ఉన్నారు.అయితే కేబినెట్‌లోకి కొందరికి అవకాశం కల్పించడంపై సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు నిరసన సెగ ఎదురవుతోంది.
తులసి గబ్బార్డ్, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ( Tulsi Gabbard, Robert F.Kennedy )జూనియర్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై భారత సంతతికి చెందిన నేత, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు.
తన సిరియస్ ఎక్స్‌ఎమ్ షో లైవ్‌లో నిక్కీ హేలీ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.గబ్బార్డ్ విదేశాంగ విధానాలను ఆమె విమర్శించారు.ప్రత్యేకించి ఉక్రెయిన్ – రష్యా యుద్ధం గురించి తులసి గబ్బార్డ్ చేసిన వివాదాదస్పద వ్యాఖ్యలు, క్లాసిఫైడ్ యూఎస్ ఇంటెలిజెన్స్‌ను లీక్ చేసిన విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు( whistleblower Edward Snowden ) క్షమాభిక్ష పెట్టడానికి మద్ధతు పలకడాన్ని నిక్కీ హేలీ ప్రస్తావించారు.
రష్యా, సిరియా, ఇరాన్, చైనాలకు అనుకూలంగా ఆమె మాట్లాడారని నిక్కీ మండిపడ్డారు.ప్రభుత్వంలో శత్రువులకు మద్ధతు పలికేవారికి స్థానం ఉండకూడదని ఆమె హెచ్చరించారు.
ఇక డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్ఎస్)కి చీఫ్‌గా నియమితులైన రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ నామినేషన్‌పైనా నిక్కీ హెలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆయన డెమొక్రాట్ , పర్యావరణ న్యాయవాది అని .ప్రస్తుతం ఫెడరల్ బడ్జెట్‌లో దాదాపు 25 శాతాన్ని పర్యవేక్షిస్తాడని, కానీ ఆరోగ్య సంరక్షణకు సంబంధించి రాబర్ట్‌కు ఎలాంటి నేపథ్యం లేదని ఆమె మండిపడ్డారు.కెన్నెడీ కేవలం సలహాదారు పాత్రకు బాగా సెట్ అవుతారని.
అతని నియామకానికి ఆమోదం తెలిపేముందు కఠినమైన ప్రశ్నలు అడగాలని సెనేట్‌కు నిక్కీ హేలీ విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతుండగా .దీనిపై తులసి గబ్బార్డ్, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.