ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై నమోదైన కేసులో తీర్పు వాయిదా పడింది.మనతత్వం అనే పుస్తకంలో న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై బీజేపీ నేత మహేందర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కరీంనగర్ ఎడిషనల్ సెషన్ కోర్టు ఎదుట ఐలయ్య హాజరైయ్యారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును నవంబర్ 28కి వాయిదా వేసింది.