తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలో పిటిషన్ ను కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేసిన ధర్మాసనం శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను ఇదివరకే కొట్టివేసిన సంగతి తెలిసిందే.







