యోనిలోంచి అబ్నార్మల్ డిస్చార్జ్ ని ఇలా తగ్గించుకోండి

స్త్రీలందరికి యోని లోంచి ఒక వైట్ పదార్థం లాంటిది బయటకువస్తుంది.దీన్ని వెజినల్ డిస్చార్జ్ అని అంటారు.

 Remedies For Treating Abnormal Vaginal Discharge-TeluguStop.com

ఇది చాలా నార్మల్ కండీషన్.యోనిని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడానికి శరీరం చేసే పనే ఇది.కాని కొందరికి ఈ డిస్చార్జ్ అబ్నార్మల్ అయిపోతుంది.పల్చగా కాకుండా, గట్టిగా, అప్పుడప్పుడు తెల్లగా, అప్పుడప్పుడు పసుపు రంగులో ఫ్లూడ్ లాంటి పదార్థం బయటకి వస్తుంది.

ఇది నార్మల్ కండీషన్ కాదు.

ఇలా జరిగితే యోని మీద ఇంఫెక్షన్లు దాడి చేయొచ్చు, యోనిలోంచి దుర్వాసన రావొచ్చు.

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉండొచ్చు.మామూలు సమయంలో కుడా దురదగా ఉండొచ్చు.

దీని వెనుక ఎన్నో కారణాలుంటాయి.క్లుప్తంగా చెబితే సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరం పట్ల జాగ్రత్తగా మెదలకపోవడం.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే డైట్ లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చాల్సిందే.

* దానిమ్మ రోజూ తినాలి.

జ్యూస్ చేసుకోని తాగినా మేలు చేస్తుంది.అలాగే శుభ్రంగా ఉన్న దానిమ్మ ఆకులు గ్రైండ్ చేసి, నీరు, బ్లాక్ పెప్పర్ కలిపి ఓ మిశ్రమం తయారుచేసి రోజుకి రెండు పూటలు తాగితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.

* రోజుకి కనీసం మూడు అరటిపండ్లు తినాలి.కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

* అబ్నార్మల్ డిస్చార్జ్ ని కంట్రోల్ చేయడానికి బెండకాయ బాగా ఉపయోగపడుతుంది.నాలుగైదు బెండకాయలు నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిలో తేనే కలిపి తాగితే మంచిది.

* నాలుగైదు జామాకులను వేడి నీటిలో వేసి, ఓ ఇరవై నిమిషాల పాటు మరిగాక, ఆ నీటిని మళ్ళీ చల్లబడ్డాక యోని పరిసరాలని శుభ్రం చేసుకోవడానికి వాడాలి.

* ఫెనుగ్రీక్ సీడ్స్ ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి, తెల్లరగానే దాంట్లో కాస్త తేనే కలుపుకోని ఖాలి కడుపుతో తాగాలి.

ఫెనుగ్రీక్ సీడ్స్ యోని యొక్క పీహెచ్ లెవెల్స్ ను మెరుగుపరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube