కబాలి కోసం కోర్ట్ నుండి మరి సినిమా పైరసీ మీద ఓ స్టేట్మెంట్ తీసుకువచ్చి 225 వెబ్ సైట్స్ దాకా మూయించిన నిర్మాత కళైపులి ఎస్ థాను సినిమా రిలీజ్ కు ముందు ఆపగలిగాడేమో కాని రిలీజ్ నాడు మార్నింగ్ షో తర్వాతే కబాలి హెచ్.డి క్వాలిటీ తమిళ వర్షన్ ప్రింట్ ఆన్ లైన్లో వచ్చేసిందట.
ఇప్పటికే టొరెంటో ద్వారా చాలామంది ఆ సినిమా డౌన్ లోడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది.మరి నిర్మాత కళైపులి పైరసి దారులను మూసివేశాడనుకుంటే సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్.
డి క్వాలిటీతో లీక్ అయ్యి మరింత సంచలనం సృష్టించింది.
ఇక పెద్ద సినిమాలకు ఈ పైరసీ బెడద ఎప్పుడు ఉంటూనే వస్తుంది.
ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో రిలీజ్ కు ముందే ఆన్ లైన్లో దర్శనమిచ్చి సినిమా మార్కెట్ ను పూర్తిగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే.మరి ఇలానే ఉంటే సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు కూడా భయపడే పరిస్థితి నెలకొనేలా ఉంది.
దీన్ని అరికట్టే కఠినతరమైన చట్టాన్ని తెచ్చి తీరాల్సిందే.







