ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌ను( 24 Akbar Road ) దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ( Congress Party ) వదిలిపెట్టింది.కొత్తగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ‘ఇందిరా గాంధీ భవన్’( Indira Gandhi Bhavan ) అనే పేరు పెట్టారు.
ఈ కార్యాలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు.
అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.
ఇకపోతే, ప్రస్తుతం 24 అక్బర్ రోడ్డులో ఏఐసీసీ( AICC ) కార్యకలాపాలు జరుగుతున్నాయి.1978 నుంచి ఈ భవంతి ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా పనిచేసింది.అయితే, కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉండకూడదని నిర్ణయించడంతో, కాంగ్రెస్ తన స్వంత భవనాన్ని నిర్మించుకోవాల్సి వచ్చింది.
దింతో నూతన కార్యాలయం 9A కోట్లా మార్గ్‌లో( 9A Kotla Marg ) ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.ఈ కొత్త భవంతిని ఆరు అంతస్తులతో నిర్మించారు.
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ భవన నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది.భవనానికి 2008లో కేంద్రం స్థలం కేటాయించగా.2009లో భవన నిర్మాణం ప్రారంభమై చివరికి ఇప్పుడు పూర్తయింది.ఈ భవనానికి ‘ఇందిరా గాంధీ భవన్’ అని పేరు పెట్టి, దీన్ని కాంగ్రెస్ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిపారు.
కోట్లా మార్గ్‌కు ప్రధాన కార్యాలయాన్ని తరలించినప్పటికీ, అక్బర్ రోడ్డులో కూడా కొన్ని కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.కేంద్ర కార్యాలయ మార్పుతోపాటు, పాత భవనంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ కొత్త భవన ప్రారంభంతో కాంగ్రెస్ కార్యకలాపాలకు మరింత అధునాతన వేదికగా నిలవనుంది.పార్టీ కార్యకర్తలు, నాయకత్వం కోసం ఇది అత్యుత్తమ వనరులుగా ఉండనుందని చెప్పడం అతిశయోక్తి కాదు.