SA20 టోర్నీలో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన 8వ మ్యాచ్ ఆసక్తికర సంఘటనలకు వేదికైంది.డర్బన్ జట్టు బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్( Henrich Klaasen ) కొట్టిన సిక్సర్ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో క్లాసెన్ బ్యాక్ ఫుట్ నుంచి బలంగా కొట్టిన బంతి 87 మీటర్ల దూరాన్ని దాటింది.ఈ సిక్సర్ స్టేడియం పైకప్పుపై పడటమే కాకుండా, అక్కడ నుంచి బౌన్స్ అయ్యి నేరుగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపైకి వెళ్లింది.
అయితే అదే సమయంలో రోడ్డుపై అక్కడే ఉన్న ఓ అభిమాని బంతిని( Ball ) చూసి దానిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఈ ఘటన కారణంగా మ్యాచ్‌లో బంతిని మార్చాల్సి వచ్చింది.స్టేడియం బయట చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆ అభిమాని తర్వాత ఏమి చేసాడో తెలియకపోయినా, వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా( Viral Video ) మారింది.ఇక మ్యాచ్జో విషయానికి వస్తే.బర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్స్ 7 ఓవర్లలోనే 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది.9 ఓవర్ల వరకు కేవలం 66 పరుగులే చేరిన పరిస్థితులలో క్లాసెన్ ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయడానికి ప్రయత్నించాడు.ఇందులో భాగంగా అతడు క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసినప్పటికీ.అతని సిక్సర్ మాత్రమే అభిమానులకు ప్రత్యేకంగా మ్యాచ్‌లో చర్చనీయాంశమైంది.అయితే డర్బన్ జట్టు 18 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటవ్వడం వల్ల జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగులతో విజయాన్ని సాధించింది.