వైరల్ వీడియో: సిక్సర్ వెళ్లిన బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని

SA20 టోర్నీలో జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన 8వ మ్యాచ్ ఆసక్తికర సంఘటనలకు వేదికైంది.

డర్బన్ జట్టు బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్( Henrich Klaasen ) కొట్టిన సిక్సర్ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో తబ్రేజ్ షమ్సీ బౌలింగ్‌లో క్లాసెన్ బ్యాక్‌ ఫుట్ నుంచి బలంగా కొట్టిన బంతి 87 మీటర్ల దూరాన్ని దాటింది.

ఈ సిక్సర్ స్టేడియం పైకప్పుపై పడటమే కాకుండా, అక్కడ నుంచి బౌన్స్ అయ్యి నేరుగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపైకి వెళ్లింది.

అయితే అదే సమయంలో రోడ్డుపై అక్కడే ఉన్న ఓ అభిమాని బంతిని( Ball ) చూసి దానిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

"""/" / ఈ ఘటన కారణంగా మ్యాచ్‌లో బంతిని మార్చాల్సి వచ్చింది.స్టేడియం బయట చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆ అభిమాని తర్వాత ఏమి చేసాడో తెలియకపోయినా, వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా( Viral Video ) మారింది.

ఇక మ్యాచ్జో విషయానికి వస్తే.బర్గ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. """/" / లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్స్ 7 ఓవర్లలోనే 51 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది.

9 ఓవర్ల వరకు కేవలం 66 పరుగులే చేరిన పరిస్థితులలో క్లాసెన్ ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయడానికి ప్రయత్నించాడు.

ఇందులో భాగంగా అతడు క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసినప్పటికీ.

అతని సిక్సర్ మాత్రమే అభిమానులకు ప్రత్యేకంగా మ్యాచ్‌లో చర్చనీయాంశమైంది.అయితే డర్బన్ జట్టు 18 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటవ్వడం వల్ల జోబర్గ్ సూపర్ కింగ్స్ 28 పరుగులతో విజయాన్ని సాధించింది.