పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) .కళ్యాణ్ రామ్ హీరోగా ఆయన నిర్మాణంలోనే తెరకెక్కిన ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడిని కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ సినిమా మధ్య సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి తదుపరి ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనిల్ రావిపూడి హీరో వెంకటేష్( Venkatesh ) తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం కూడా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు.అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.నేను ఎప్పుడైనా సరే ఓ సినిమాను తెరకెక్కించే సమయానికి ఆ సినిమాకి పెట్టే బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.ఆ హీరోకి మార్కెట్ ఏ రేంజ్ లో ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకొని సినిమా కోసం బడ్జెట్ కేటాయిస్తానని తెలిపారు.
నిర్మాతలు డబ్బులు పెడుతున్నారు కదా అని మన ఇష్టానుసారం డబ్బును ఖర్చు చేయను.నువ్వు సంపాదించిన డబ్బును నీ ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు చేసుకో కానీ వేరే వాళ్ళు పెడుతున్న డబ్బులను ఖర్చు చేసే సమయంలో బాగా ఆలోచించి ఖర్చు చేయాలని తెలిపారు.డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.అయితే ఈయన మాత్రం ఈ కామెంట్స్ డైరెక్టర్ శంకర్( Director Shankar ) ని ఉద్దేశించి చేశారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
రామ్ చరణ్( Ram Charan ) సినిమా కోసం ఏకంగా 400 కోట్ల బడ్జెట్ కేటాయించారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక నిర్మాత డబ్బులు పెడుతున్నారన్న ఉద్దేశంతో ఇలా డబ్బు ఖర్చు చేయడం సరైనది కాదనీ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ సరిగ్గా శంకర్ కు సరిపోతాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.