1.ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో విచారణ
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.తంగేళ్ల శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా , హై కోర్ట్ విచారణకు స్వీకరించింది.
2.మునుగోడు ఎమ్మెల్యే నేనే
మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది నేనే అని, మునుగోడు ఎమ్మెల్యే తానే అని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు.
3.రాజసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై విచారణ
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ పై ఈ రోజు హై కోర్ట్ లో విచారణ జరిగింది.దీనిపై వాదోప వాదనలు జరగగా.విచారణను రేపటికి వాయిదా పడింది.
4.ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై దాడి
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై దాడి జరిగింది.ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , జెడ్పీ చైర్మన్ జగదీష్ సహా పలువురికి గాయాలయ్యాయి.
5.రాహుల్ గాంధీ పర్యటన
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చార్మినార్, రవీంద్ర భారతి, తెలుగు తల్లి ఓవర్ మీదుగా సాగుతోంది.
6.తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది
మునుగోడు అసెంబ్లీ ఓపెన్ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
7.ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రగతి భవన్ స్క్రిప్ట్
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రగతి భవన్ స్క్రిప్ట్ అని బిజెపి కీలక నేత లక్ష్మణ్ అన్నారు.
8.తెలంగాణలో బిజెపి నేతల ఫోన్లు టాప్ చేస్తున్నారు
తెలంగాణలో బిజెపి నేతలు ఫోన్లను టాప్ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఫిర్యాదు చేశారు.
9.మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ఇంట్లో సోదాలు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.
10.మునుగోడు ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా ఈనెల 3న జరిగే పోలింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
11.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు యాదాద్రిపై ఉన్న ప్రేమ వేములవాడ రాజన్న పై లేదా అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు.
12.అచ్చం నాయుడు పై స్పీకర్ తమ్మినేని విమర్శలు
టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడుకి తమను ప్రశ్నించే అర్హత లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
13.జనసేన పై మంత్రి కామెంట్స్
జనసేన పొలిటికల్ పార్టీ కాదని సినిమా పార్టీ అని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
14.అమరావతి పాదయాత్ర అనుమతి రద్దు పిటిషన్ కొట్టివేత
అమరావతి పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది.
15.వైయస్సార్ పై ఏపీ గవర్నర్ కామెంట్స్
వైయస్సార్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు.
16.ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.
17.కర్నూలులో విద్యార్థి ఆత్మగౌరవ ర్యాలీ
రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో విద్యార్థి ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
18.శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు
శబరి ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది.గుంటూరు జిల్లాలోని కంకరగుంట గేటు సమీపంలో రైల్వే ట్రాక్ పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డుని కట్టారు.ఇది గమనించిన రైల్వే సిబ్బంది శబరి ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేసి రాడ్డు ను తొలగించారు.ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 154,174 సీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
19.పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీలో నారాయణకు బెయిల్ రద్దు
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి పి నారాయణ కు ఇచ్చిన బెయిల్ ను చిత్తూరు కోర్టు రద్దు చేసింది.
20.ఫిట్ ఇండియా ర్యాలీ
అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ లోని డొంకరాయి సిఆర్పిఎఫ్ సీ /42 బెటాలియన్ పోలీసులు ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు.