ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన ఎల్బీ శ్రీరామ్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఎల్బీ శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పోషించిన పాత్రలకు సంబంధించి షాకింగ్ కామెంట్లు చేశారు.
నా యాక్టింగ్ రైటింగ్ ను డామినేట్ చేసిందని ఎప్పుడూ అనుకోనని ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు.
నాటకాలు రాయాల్సిన టైమ్ లో రాశానని ఆయన కామెంట్లు చేశారు.
రైటర్లు రాసిన డైలాగ్స్ ను కమెడియన్లు ఇంప్రూవ్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.కొత్తగా డైలాగ్ డెలివరీ ఉండాలని పట్టిపట్టి డైలాగ్స్ చెబుతానని ఆయన కామెంట్లు చేశారు.నా దృష్టిలో పాత్రలు అంటే నగరాలలో దొరకరని ఆయన చెప్పుకొచ్చారు.250కు పైగా సినిమాలు చేశానని ఆ సినిమాలలో 100 సినిమాలలో మంచి వేషాలు వేశానని ఆయన పేర్కొన్నారు.

వేగుచుక్క అనే సినిమాలో నవరసాలు ఉన్న పాత్రను పోషించానని ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు.కొత్తగా నేను నటుడిగా వచ్చిన సమయంలో గోచీ పెట్టుకోమన్నారని బూతు మాటలు చెప్పమన్నారని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.ఇష్టం లేకపోయినా అలాంటి కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.ఆ పాత్రలు చేయనని చెబితే కొత్త ఆఫర్లు రావని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.
దర్శకుడు వంశీ గారికి నేను కృతజ్ఞుడిని అని ఆయన చెప్పుకొచ్చారు.ఇ.వి.వి సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు.నా సినిమాలలో సొంతూరు ఇష్టమని ఆయన తెలిపారు.నాకు రైటర్ గా అప్పుల అప్పారావు ఇష్టమని ఆయా చెప్పుకొచ్చారు.ఎల్బీ శ్రీరామ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎల్బీ శ్రీరామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







