కివి పండు.దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎన్నో జబ్బుల నుంచి రక్షించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివి పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు.మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో, గుండె జబ్బులను దూరం చేయడంలో, రక్త హీనత తగ్గించడంలో, కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇలా కివి పండు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
అయితే ఆరోగ్యానికే కాదు.ముఖాన్ని అందంగా మెరిపించడంలోనూ కివి పండు గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి కివి పండును చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో కివి పండు గుజ్జు, కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల చర్మంపై నల్ల మచ్చలు, ముడతలు పోయి.ముఖం అందంగా మారుతుంది.
రెండొవది.ఒక బౌల్‌లో కివి పండు గుజ్జు, కొద్దిగా తేనె మరియు నిమ్మ రసం వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అరగంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పట్టడంతో పాటు చర్మంపై మృతకణాలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
మూడొవది.ఒక బౌల్‌లో కివి పండు గుజ్జు వేసి అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసి… పావు గంట పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కళ్లను క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు, చారలు క్రమంగా తగ్గిపోయి.కళ్లు అందంగా మారతాయి.