టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే కేవలం తెలుగులోనే కాదు అటు బాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.తెలుగులో మాత్రం స్టార్ సినిమా అంటే ముందు ఆమె కాదన్నాకే వేరే హీరోయిన్ కు ఛాన్స్ వెళ్తుంది.
స్టార్ హీరోలు కూడా పూజాతో రొమాన్స్ కు సై అంటున్నారు.అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాతో అమ్మడు క్రేజ్ తెచ్చుకుంది.
ఆ తర్వాత స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాక మరోసారి అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలో నటించింది.బన్నీతో పూజా హెగ్దే కాంబో సినిమాకు హిట్ సెంటిమెంట్ తెచ్చింది.
ఇక లేటెస్ట్ గా ఈ ఇద్దరు కలిసి మరోసారి నటించబోతున్నారని తెలుస్తుంది.
అల్లు అర్జున్ నటిస్తున్న ఐకాన్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే పేరుని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
వకీల్ సాబ్ తో టాలెంట్ చూపించిన డైరక్టర్ వేణు శ్రీరాం అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేస్తున్నాడు.దిల్ రాజునిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
డీజే, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్, పూ జా హెగ్దే హ్యాట్రిక్ కాంబోగా ఈ సినిమా వస్తుంది.మరి ఈ సినిమాలో వీరి రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.