టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక తన లుక్ తో మాత్రం ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకున్నాడు.ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు లుక్ ప్రస్తుతం వైరల్ గా మారగా అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఎన్నో సినిమాలలో నటించాడు.
ఇక రాజకుమారుడు సినిమాలో తన లుక్ తో ఎంతోమంది అమ్మాయిల మనుసులను దోచుకున్న మహేష్ బాబు ఇప్పటికీ అలాంటి లుక్ తో తన మొదటి రోజులను గుర్తు చేస్తున్నాడు.పైగా తనకు తన ఎత్తు కొడుకు కూడా ఉండటంతో చాలామంది తన కొడుకుకు అన్నలాగా ఉన్నాడని కామెంట్స్ కూడా చేశారు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు.ఇక రాజమౌళి తో కూడా మరో సినిమా చేయనున్నాడు.అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఓ సినిమా ఫిక్స్ చేశాడు మహేష్ బాబు.ఇదిలా ఉంటే తాజాగా తన భార్యతో ఉన్న ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.

అందులో మహేష్ బాబు తన ముఖానికి మాస్కు ధరించి.ఇన్ షర్ట్ వేసుకొని ఎంతో సింపుల్ గా కనిపించాడు.ఈ ఫోటోను చూసిన మహేష్ అభిమానులు మళ్లీ ఆయన అందాన్ని పొగడకుండా ఉండట్లేదు అనే చెప్పవచ్చు.
తన లుక్ ని చూసి ఇంత సింపుల్ లుక్ లో ఉన్న కూడా స్టైలిష్ గా కనిపిస్తున్నాడని అంటున్నారు.ఇక ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన లుక్ కూడా విడుదల కాగా అభిమానులను బాగా ఆకట్టుకుంది.