డార్క్ లిప్స్ తో దిగులెందుకు.‌. ఈ చిట్కాతో వారంలో పరిష్కారం పొందండి!

ఒక్కోసారి పెదాలు చాలా నల్లగా మారిపోతుంటాయి.ముఖ్యంగా వింటర్ సీజన్( Winter season ) లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

 Follow This Simple Remedy To Get Rid Of Dark Lips! Dark Lips, Lips Lightening Re-TeluguStop.com

తేమ తగ్గిపోవడం వల్ల పెదాలు పొడి పొడిగా మారుతుంటాయి.నల్లగా తయారవుతుంటాయి.

దీంతో ఎంత‌గానో బాధపడుతుంటారు.పెదాల నలుపును వదిలించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా ఎంతగానో హెల్ప్ చేస్తుంది.ఈ చిట్కాతో మీ సమస్యకు వారంలోనే పరిష్కారం ల‌భిస్తుంది.

మరి ఇంతకీ పెదాల నలుపు ను పోగొట్టే ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Beautiful Lips, Tips, Dark Lips, Lips, Remedy, Latest, Lip Care, Lips Rem

బ్రౌన్ షుగర్( Brown Sugar ).లిప్స్ డార్క్ నెస్ ను సమర్థవంతంగా దూరం చేస్తుంది.పెదాలను అందంగా ఆకర్షణీయంగా మెరిపిస్తుంది.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వ‌న్‌ టేబుల్ స్పూన్ వాసెలిన్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ ( Coconut oil )వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Beautiful Lips, Tips, Dark Lips, Lips, Remedy, Latest, Lip Care, Lips Rem

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలి.రోజులో ఏదో ఒక సమయంలో ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో సున్నితంగా పెదాలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.పెదాల నలుపు క్రమంగా మాయం అవుతుంది.పొడిబారిపోయి నల్లగా నిర్జీవంగా మారిన పెదాలు అందంగా, తేమగా, ఆకర్షణీయంగా మారతాయి.డార్క్ లిప్స్ తో దిగులు చెందుతున్న వారికి ఈ సింపుల్ రెమెడీ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube