ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లను జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ‘మే’ డే ( ‘May’ day)కావడంతో ఇవాళ బ్యాంకులకు సెలవు ఉంది.దీంతో రేపు లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేయని వారికి ఇంటి దగ్గరే పెన్షన్లను అధికారులు పంపిణీ చేయనున్నారు.అకౌంట్లు లేని వారితో పాటు దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందించనున్నారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయని తెలుస్తోంది.అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
.






