డార్క్ లిప్స్ తో దిగులెందుకు.‌. ఈ చిట్కాతో వారంలో పరిష్కారం పొందండి!

ఒక్కోసారి పెదాలు చాలా నల్లగా మారిపోతుంటాయి.ముఖ్యంగా వింటర్ సీజన్( Winter Season ) లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

తేమ తగ్గిపోవడం వల్ల పెదాలు పొడి పొడిగా మారుతుంటాయి.నల్లగా తయారవుతుంటాయి.

దీంతో ఎంత‌గానో బాధపడుతుంటారు.పెదాల నలుపును వదిలించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా ఎంతగానో హెల్ప్ చేస్తుంది.

ఈ చిట్కాతో మీ సమస్యకు వారంలోనే పరిష్కారం ల‌భిస్తుంది.మరి ఇంతకీ పెదాల నలుపు ను పోగొట్టే ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

"""/" / బ్రౌన్ షుగర్( Brown Sugar ).లిప్స్ డార్క్ నెస్ ను సమర్థవంతంగా దూరం చేస్తుంది.

పెదాలను అందంగా ఆకర్షణీయంగా మెరిపిస్తుంది.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ షుగర్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వ‌న్‌ టేబుల్ స్పూన్ వాసెలిన్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ ( Coconut Oil )వేసుకొని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలి.

రోజులో ఏదో ఒక సమయంలో ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో సున్నితంగా పెదాలను స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

పెదాల నలుపు క్రమంగా మాయం అవుతుంది.పొడిబారిపోయి నల్లగా నిర్జీవంగా మారిన పెదాలు అందంగా, తేమగా, ఆకర్షణీయంగా మారతాయి.

డార్క్ లిప్స్ తో దిగులు చెందుతున్న వారికి ఈ సింపుల్ రెమెడీ చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 21, మంగళవారం2024