బుల్లితెర సీరియల్ నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శోభా శెట్టి( Sobha Shetty ) ఒకరు.ఈమె కన్నడ సీరియల్ నటి అయినప్పటికీ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈమె కార్తీకదీపం( Karthika Deepam ) సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా కార్తీకదీపం సీరియల్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఈ సీరియల్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె దాదాపు 14 వారాల పాటు హౌస్ లో కొనసాగారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శోభ ఈ కార్యక్రమం తర్వాత ఏ సీరియల్స్ లోను నటించలేదు అయితే ఈమె బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈమె మరొక సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డిని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని ఈమె అందరికీ తెలియజేశారు.ఇక తాము కొత్త ఇంటిని కొనుగోలు చేసాము అంటూ ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను చేశారు.
తన ఇంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా తన కొత్త ఇంటి గృహప్రవేశాన్ని ( House Warming ) చేశారని తెలుస్తోంది.ఇలా తన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.
ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్లు పలువురు హాజరై సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.