ఇటీవల కాలంలో సెలబ్రిటీలు అందరూ కూడా కెరియర్ పై ఫోకస్ పెడుతూ పెళ్లి పిల్లలు అనే విషయాలను పక్కన పెడుతున్నారు.అయితే ఫ్యూచర్లో ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పిల్లలను కన్నడం కోసం ముందుగానే వారు ఎగ్ ప్రీజింగ్ ( Egg Freezing ) చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
మెగా కోడలు ఉపాసన( Upasana ) కూడా ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ గురించి అందరికీ అవగాహన కలిగేలా చేశారు.ఇక ఈమె కూడా అదే పద్ధతిలోనే కుమార్తెను కన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈమె బాటలోనే నటి మెహ్రీన్ ( mehreen ) కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా హాస్పిటల్లో ఈమె తన ఓవర్ ఈజ్ నుంచి ఎగ్ ఫ్రీజ్ చేసే ప్రాసెస్ కి సంబంధించినటువంటి వీడియోని షేర్ చేశారు.ఇక ఈ వీడియోని షేర్ చేసిన మెహ్రిన్ ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు వెళ్లాలా? వద్దా? అని చాలా ఆలోచించాను.నా మనసును సిద్దం చేసుకోవడానికి 2 సంవత్సరాలపాటు ఆలోచించి చివరికి ఈ నిర్ణయం తీసుకున్నానని ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.అయితే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయాలా వద్దా అని కూడా ఆలోచించానని ఈమె తెలిపారు.

ఈ వీడియోని నేను షేర్ చేయటం వల్ల ఎంతోమంది ఈ విషయంపై అవగాహన కల్పించుకుంటారని భావించి షేర్ చేశానని తెలిపారు.ఫ్యూచర్ కోసం, భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతలను నివారించడానికి అందరు స్త్రీలు దీన్ని ఎంపిక చేసుకోవాలని ఈమె తెలిపారు.ఇలా ఈమె ఎగ్ ఫ్రీజింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన నెటిజన్స్ ఈమె ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో లేరంటూ కామెంట్లు చేస్తున్నారు.







