ఈ ఎన్నికల్లో గెలుపు టిడిపికి చావో , రేవో అన్నట్టుగా ఉండడంతో, గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.జనసేన , టిడిపి, బిజెపి( Janasena, TDP, BJP ) కూటమిని గెలిపించుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
కూటమి విజయ అవకాశాలను మెరుగు పరుచుకునేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టడం లేదు.ఒకవైపు ఏపీవ్యాప్తంగా చంద్రబాబు( Chandrababu ) బస్సు యాత్రలు నిర్వహిస్తూనే, మరోవైపు ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపైనరులను రంగంలోకి దింపే పనుల్లో నిమగ్నమయ్యారు.
నందమూరి వారసులను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు.దీనిలో భాగంగానే దివంగత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణను ఎన్నికల ప్రచారంలోకి దింపుతున్నారు.

ఈరోజు నిమ్మకూరులో ఎన్టీఆర్ , బసవతారకం ( NTR, Basavatharakam )విగ్రహాలకు నివాళులు అర్పించి అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి నందమూరి రామకృష్ణ( Nandamuri Ramakrishna ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.గుడివాడ , పెడన, పామర్రు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో రామకృష్ణ పాల్గొంటారు. ఉమ్మడి కృష్ణ ,గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు .ఎన్నికల ప్రచార తంతు పూర్తయ్యే వరకు ఆయన వివిధ జిల్లాలో పర్యటించే విధంగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.మరోవైపు చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( MLA Nandamuri Balakrishna
) ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

మరోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఆ నియోజకవర్గ తో పాటు ఉమ్మడి అనంతపురం , కర్నూలు , నెల్లూరు ప్రకాశం జిల్లాలోనూ స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తూ బహిరంగ సభలలో పాల్గొంటున్నారు.మే 2 వ తేదీన గురువారం సాయంత్రం 4.30 గంటలకు చీపురుపల్లి ,సాయంత్రం 6 గంటలకు విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.మే 3 వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు భీమిలి , సాయంత్రం 6 గంటలకు శృంగవరపుకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు విశాఖ రోడ్డు షోలో బాలకృష్ణ పాల్గొంటారు.