మెగా కోడలు ఉపాసన( Upasana ) ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇలా ఇప్పటికే ఎన్నో రకాల బిజినెస్ లను చేసుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.అయితే ఉపాసన ఇవి మాత్రమే కాకుండా ఇటీవల తన అత్తయ్య సురేఖ (Surekha) పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ కిచెన్స్ (Attamma Kitchens) అంటూ సరికొత్త బిజినెస్ ప్రారంభించారు.
స్వయంగా సురేఖ చేతుల మీద తయారైనటువంటి వంటలన్నీ కూడా మనకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి.ఇక ఈ అత్తమ్మ కిచెన్స్ ప్రమోషన్లలో ఉపాసన ఇటీవల చాలా బిజీ అయ్యారు.
ఇకపోతే తాజాగా తన అత్తయ్య ఆవకాయ పచ్చడి పెట్టిన వీడియోని కూడా ఈమె అత్తమ్మ కిచెన్స్ ద్వారా షేర్ చేశారు.ఇక ఈ వీడియోలో భాగంగా సురేఖ దగ్గర ఉండి మరి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అనే విషయాలన్నింటినీ చూసుకుంటూ ఆవకాయ పచ్చడిని తయారు చేశారు.ఇక ఆవకాయ పచ్చడి తయారైన తర్వాత ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈమె అన్నంలో ఆవకాయ కలిపి అక్కడ ఉన్నటువంటి వారందరికీ పెట్టింది.ఇక అంజనమ్మ వద్దకు వెళ్లి అత్తయ్య ఎలా ఉంది మీరు చెప్పాలి అంటూ ఆమెకు ఒక ముద్ద పెట్టగా అన్ని సరిగ్గా సరిపోయాయి అంటూ చెప్పేశారు.
అనంతరం ఉపాసన తన అత్తయ్యని చూపిస్తూ అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగా సురేఖ దుబాయ్ ట్రిప్ (Dubai Trip) వెళ్తున్నామని తెలిపారు .ఇక్కడ ఆవకాయ పచ్చడి ఇతర పనుల వల్ల చాలా అలసిపోయానని మీ మామయ్య నన్ను దుబాయ్ హాలిడే ట్రిప్ తీసుకు వెళుతున్నారని చెప్పారు.ఇలా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఆవకాయ పచ్చడి చేసినందుకు దుబాయ్ తీసుకెళుతున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక చిరంజీవి దుబాయ్ వెళ్లడంతో కొద్దిరోజుల పాటు విశ్వంభర సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని తెలుస్తోంది.