విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ( YCP ) పాలన కొనసాగిందని సీఎం జగన్ అన్నారు.58 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందించామన్న సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.రానున్న ఎన్నికలు పేదల ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబు( Chandrababu ) పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందానని ప్రశ్నించారు.ఎన్నికలు అయిన తరువాత మ్యానిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్టలో పడేస్తారని విమర్శించారు.మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత వైసీపీదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు