టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు తమ ఉమ్మడి మ్యానిఫెస్టో ను విడుదల చేశాయి.మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిసిద్దార్ధనాథ్ సింగ్ పక్కనే ఉన్నా .
ఆయన మేనిఫెస్టో కాపీని తీసుకునేందుకు కానీ, విడుదల సమయంలో మేనిఫెస్టోను ప్రదర్శించేందుకు గాని ఆసక్తి చూపించకపోవడం వైరల్ అయింది.అయితే టిడిపి, జనసేన మేనిఫెస్టో మాత్రమేనని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో, అసలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు బిజెపి ఎందుకు దూరంగా ఉంది అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.
ఏపీలో టీడీపీ, జనసేన హామీలకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము అన్నట్లుగా బిజెపి( BJP ) వ్యవహరిస్తోంది.కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నా.టిడిపి, జనసేన ఇస్తున్న హామీల కు బిజెపి కూడా మద్దతు పలికితే, ఆ తర్వాత ఆ భారం అంతా తమ పైన పడుతుందని, ఒకవేళ ఈ మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయలేకపోతే బిజెపి కూడా ఆబాసపాలు కావాల్సి వస్తుంది అనే భయము బిజెపి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే ఉమ్మడి మేనిఫెస్టోకు ( joint manifesto ) బిజెపి దూరంగా ఉంది.ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల విషయంలో తీవ్ర విమర్శలు చేసిన టిడిపి, జనసేన ఇప్పుడు అంతకంటే మించిన స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలకి కొన్ని పేర్లు మార్చి ప్రకటించారు.
అయితే ఈ పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పలేకపోవడం వంటివి జనాల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.ఈ విషయాన్ని ముందుగానే గమనించిన బిజెపి వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది.
ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేద్దాం అన్న టిడిపి చంద్రబాబు( Chandrababu ) ప్రతిపాదనకు బిజెపి అధిష్టానం నో చెప్పడానికి కారణాలు ఇవేనట.టిడిపి, జనసేన మేనిఫెస్టోకు, తమకు సంబంధం లేదన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తుంది.

ఉచిత పథకాలకు బిజెపి వ్యతిరేకం కావడంతో, చంద్రబాబు ఇచ్చే హామీలకు తాను బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా బిజెపిపై పడుతుందని, ఇప్పటికే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయలేదని, దీనికి బిజెపి కూడా బాధ్యత వహించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పదేపదే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ ఉండడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.రానున్న రోజుల్లో ఆ ప్రభావం తమపై పడకుండా ముందుగానే బిజెపి సైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.వైసీపీ ప్రకటించిన మ్యానిఫెస్టో కు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కలుపుకుంటే మరో 70 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చలేక వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడుతోంది.
ప్రతినెల ఇదే రకమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి.టిడిపి కూటమి అధికారంలోకి వస్తే ఈ కష్టాలు మరింత పెరుగుతాయని బిజెపి అంచనా వేస్తూ.
టిడిపి ప్రకటించిన మేనిఫెస్టోకు తమకు సంబంధం లేదన్నట్లుగా ముందుగానే చేతులు దులిపేసుకుంటోంది.