ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు.అయితే తాజాగా వర్మ పవన్ గురించి సంచలన పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
వర్మ తన పోస్ట్ లో జన సైనికులు పవన్ కళ్యాణ్ కు నాదెండ్ల మనోహర్ కు దూరంగా ఉండాలని చెప్పాలని పేర్కొన్నారు.
గతంలో పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి కూడా తాను ఇలాగే వార్నింగ్ ఇచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు నా మాటే నిజమైందని వర్మ కామెంట్ చేశారు.ఆనాడు జూలియస్ సీజర్ ను బ్రూటస్ సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టుగా ఈసారి పవన్ ను చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తారని దేవుడు నాకు కలలో చెప్పాడని ఆయన కామెంట్లు చేశారు.
![Telugu Chandrababu, Janasena, Pawan Kalyan-Movie Telugu Chandrababu, Janasena, Pawan Kalyan-Movie]( https://telugustop.com/wp-content/uploads/2023/01/rgv-sensational-comments-about-pawan-kalyan-goes-viral-in-social-mediaa.jpg)
వర్మ చేసిన ఈ పోస్ట్ కు 12000కు పైగా లైక్స్ వచ్చాయి.వర్మ చెప్పింది నిజమేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం వర్మ చేసిన కామెంట్లలో నిజం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.మరోవైపు నాదెండ్ల మనోహర్ సైతం పవన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ మాటల్లో క్లారిటీ మిస్ అవుతోందని ఆయన కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది.
![Telugu Chandrababu, Janasena, Pawan Kalyan-Movie Telugu Chandrababu, Janasena, Pawan Kalyan-Movie]( https://telugustop.com/wp-content/uploads/2023/01/rgv-sensational-comments-about-pawan-kalyan-goes-viral-in-social-mediab.jpg)
పవన్ కళ్యాణ్ పదేపదే పొత్తు గురించి ప్రస్తావించడం వల్ల పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం జరుగుతోందనే కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుండటం గమనార్హం.సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ మార్కెట్ పెరుగుతుండగా పవన్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.