బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యాంకర్ రష్మీ( Anchor Rashmi ) ప్రస్తుతం జబర్దస్త్( Jabardasth ) యాంకర్ గా బుల్లితెర స్టార్ గా కొనసాగుతున్నారు.పలు కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె మరోవైపు సినిమాలలో కూడా పలు పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడుతూ ఉంటారు.ముఖ్యంగా మూగ జీవాలకు ఎవరైనా హాని చేస్తే మాత్రం రష్మీ వారికి శిక్ష పడే వరకు వదలరు.
ఇలా మూగ జీవాల గురించి మహిళల గురించి ఎవరైనా అసభ్యకరంగా వ్యవహరించిన వారి పట్ల ఈమె స్పందిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.ప్రముఖ రైటర్ రచెల్ మోరన్( Rachel Moran ) రాసిన కోట్‌ని స్టోరీలో షేర్ చేసింది.మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్ పెట్టాలి, కానీ డిక్ కాదని ఉన్న కోట్‌ని షేర్ చేశారు.
ఇందులో మరో ఆసక్తికర విషయం దాగుంది.చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం( Prostitution ) అనేదే ఉండదు.దాని మనుగడ ఉండదని తెలిపింది.మహిళల వ్యభిచారం, ఆకలి బాధలపై ఓ వేశ్య చెప్పిన డైలాగుని ఇలా పోస్ట్ ద్వారా వెల్లడించారు.ఈ విధంగా రైటర్ పోస్టుని రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది అయితే ఈమె షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ పై పలువురు తనకు మద్దతు తెలుపుతూ కామెంట్ చేయడం మరికొందరు విమర్శలు చేస్తున్నారు.