ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తూ ఉంటారు.ఇలా కేవలం బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తుంటారు కానీ యోగా చెయ్యరు.
అలాగే చెయ్యాల్సిన కొన్ని రకాల వ్యాయామాలు చెయ్యరు.చాలామందికి వ్యాయామాలు చేసే అలవాటే ఉండదు.
కానీ యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.దీని వల్ల అందం, ఆరోగ్యం రెండిటిని కాపాడుకోవచ్చు.
యోగాలలో ఒకటి గోళ్లను రుద్దడం. ఈ యోగా చెయ్యడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.గోళ్లను ఒక చేతి గోర్లను, మరోచెతి గోర్లతో రుద్దడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.జుట్టు రాలిపోయే సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు.
అయితే గోళ్లను క్రమం తప్పకుండా రుద్దడం వల్ల శరీరంలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని నియంత్రించవచ్చు.

ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అంతే కాదు గోళ్లను రుద్దడం వల్ల తెల్లజుట్టు, బట్టతల, నిద్రలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఒత్తిడిని దూరం చేస్తుంది.
గోళ్లను కలిపి రుద్దడం వల్ల రిఫ్లెక్సాలజీ రిఫ్లెక్స్ ప్రాంతంపై ఒత్తిడి పెరుగుతుంది.ఈ ఒత్తిడితో శరీరంలో నొప్పి, మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు.
అదే విధంగా ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.గోళ్ల ను రుద్దడం వల్ల మన శరీరంలోని అనేక అవయవాలకు మంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అలాగే క్రమం తప్పకుండా ఈ యోగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఇలా గోర్లు రుద్దడం వల్ల మహిళలకు పీరియడ్స్ సమయంలో లో వచ్చే కడుపు నొప్పికి ఉపశమనం కలుగుతుంది.
ఇలా ఈ యోగాను క్రమం తప్పకుండా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.