గుండెలు గుభేల్: మహాకుంభమేళాలో 100 అడుగుల పాము ప్రత్యక్షం.. వైరల్ వీడియోలో ట్విస్ట్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్‌ నగరంలో( Prayagraj city ) మహాకుంభమేళా జరుగుతున్న సంగతి విధితమే, ఈ ఆధ్యాత్మిక వేడుకకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ పాము వీడియో( snake video ) తెగ వైరల్ అవుతోంది.

 Mahakumbhamela 100 Feet Snake Live Twist In The Viral Video, Giant Snake, Mahak-TeluguStop.com

వంద అడుగుల భారీ కొండచిలువ గంగానది ఒడ్డున ప్రత్యక్షమైందని, భక్తులు భయంతో పరుగులు తీస్తున్నారని ఆ వీడియోలో చూపిస్తున్నారు.సంగం తీరంలో జరుగుతున్న ఈ మహా పండుగకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు.

షాపులు, భక్తులు, ఫుడ్ పంపిణీ అంటూ రకరకాల వీడియోలు వైరలవుతున్న ఈ సమయంలో ఈ 100 అడుగుల పాము వీడియో మాత్రం అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.నిజంగానే అంత పెద్ద పాము వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు, భయపడుతున్నారు.

అయితే, ఈ వీడియో నిజమా కాదా అని తేల్చేందుకు ఫాక్ట్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.వీడియోలో చాలా తేడాలు కనిపించాయి. మొదటిది, వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద పెద్ద బిల్డింగ్స్‌ కనిపిస్తున్నాయి.కానీ ప్రయాగ్‌రాజ్‌లో అలాంటి కట్టడాలు లేవు.

అంటే వీడియోలో కనిపిస్తున్నది మహాకుంభమేళా జరిగే ప్రాంతం కాదు.ఇంకా పాము సైజు, రంగు కూడా చాలా వింతగా ఉన్నాయి.

మనుషుల సైజులు సైతం కరెక్ట్‌గా లేవు.వంతెన బయట మనుషులు, బైకులు కదులుతున్న వింత వింత సీన్లు కూడా వీడియోలో ఉన్నాయి.

ఇవన్నీ చూస్తుంటే ఇది నిజమైన వీడియో కాదని, ఎవరో కావాలనే క్రియేట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

ఈ వీడియోను ఇన్‌స్టాలో “మహాకుంభమేళాలో 100 అడుగుల పొడవైన, 1000 కేజీల బరువున్న పాము కనిపించింది, భక్తులు భయాందోళనలు” అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు.దీంతో నిజంగానే పాము ఉందేమో అని భక్తులు టెన్షన్ పడ్డారు.కానీ దీనిపై లోతుగా విచారణ చేయగా ఇలాంటిదేమీ జరగలేదని తేలింది.

అంత పెద్ద పాము కనిపించినట్లు ఎక్కడా రిపోర్ట్ చేయలేదు, నమ్మదగిన ఆధారాలూ లేవు.

గడిచిన 11 రోజుల్లో దాదాపు 10 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు వచ్చారు.కానీ ఎవ్వరూ ఇంత పెద్ద పాము గురించి చెప్పలేదు.వీడియోలో ఉన్న తప్పులు, నిజమైన ఆధారాలు లేకపోవడం చూస్తే, ఇది కచ్చితంగా ఫేక్ వీడియోనే అని తేలిపోయింది.ఈ వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో క్రియేట్ చేశారు.100 అడుగుల పాము అనే వార్త పూర్తిగా అబద్ధం, నమ్మకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube