గోరింటాకు పెట్టుకొని పెళ్ళికొడుకు గెటప్ తో షాకిచ్చిన అడవి శేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

అబ్బాయిలైతే హీరోయిన్లను, అమ్మాయిలైతే హీరోలను  ఇష్టపడుతూ ఉంటారు.వాళ్ళు అందంగా కనిపిస్తే చాలు వాళ్ళ అందానికి ఫిదా అవుతూ ఉంటారు.

 Adavi Sesh Shocked Her Groom With Gourd And Getup Photos Going Viral , Adavi Se-TeluguStop.com

ఇక వాళ్ళు కొత్త గెటప్ లో కనిపిస్తే చాలు వెంటనే వారి ఫోటోలను వైరల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా హీరో అడవి శేష్ పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించగా అమ్మాయిలు మాత్రం బాగా ఫిదా అవుతున్నారు.

ఇంతకు ఆయన పెళ్లి కొడుకు గెటప్ ఎందుకు వేసుకున్నాడో అసలు విషయం తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో అడవి శేష్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.

హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.ప్రతి ఒక్క సినిమాలో హీరోగా తన పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.

అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అడవి శేష్ తొలిసారిగా 2010లో కర్మ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అలా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను నిలుపుకున్నాడు.

ఇక 2018 లో విడుదలైన గూఢచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

నిజానికి కెరీర్ మొదటి నుంచి వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్నాడు అడవి శేష్.మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఉంటాడు.

నిజానికి ఈయన ఎంచుకునే సినిమాలు అన్ని చివర్లో మంచి విషయాన్ని అందిస్తూ ఉంటాయి.చాలా వరకు ఈయన మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

ప్రస్తుతం ఈయన ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.అంతేకాకుండా ఒక స్టార్ హోదాకు చేరుకున్నాడని చెప్పాలి.

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.సోషల్ మీడియాలో కూడా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక నిత్యం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటాడు.అంతే కాకుండా తన సినిమాల గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తెలుపుతూనే ఉంటాడు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజా ఆయన కొన్ని ఫోటోలు పంచుకున్నాడు.అందులో ఆయన పెళ్లి కొడుకు గెటప్ లో ఉండగా.తన చేతికి గోరింటాకు పెట్టుకున్నట్లు కూడా కనిపించాడు.ఆయనను ఆ లుక్కులో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరి కొంతమంది పెళ్లి చేసుకుంటున్నాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ అసలు విషయం ఏంటంటే.

తన చెల్లి పెళ్లి సందర్భంగా ఆయన అలా తయారయ్యాడు.తాజాగా తన చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా ఆ ఫోటోలను పంచుకుంటూ బాగా సందడి చేశాడు.

ఇక అడివి శేష్ ను చూసి అమ్మాయిలు మాత్రం ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube