చూడ‌టానికి అంద‌మైన పూదోట‌.. ముట్టుకుంటే అంతే సంగ‌తి..

ఈ భూ ప్ర‌పంచంలో చాలా ర‌కాల జంతువులు, చెట్లు, వింత ప్ర‌దేశాలు ఉంటాయి.అయితే ఇలాంటి వాటి గురించి అంద‌ర‌కీ చెప్పేందుకు సోష‌ల్ మీడియా వేదిక అవుతోంది.

 Beautiful Flower Garden To Look At Thats All There Is To Touching, Dangerous Flo-TeluguStop.com

వింత వింత చెట్ల గురించి లేదంటే వింత ప్ర‌దేశాల గురించి మ‌న‌కు నిత్యం ఇక్క‌డి వీడియోలు లేదంటే ఫొటోల రూపంలో క‌నిపిస్తూనే ఉంటుంది.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వింత వార్త గురించి మీకు చెప్ప‌బోతున్నాం.

పూదోట గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు కావ‌చ్చు.ఎందుకంటే ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన పూదోట‌గా పేరు తెచ్చుకుంది.

నిజానికి పూదోట అంటే చూసేందుకు ఎవ‌రికైనా రెండు కండ్లు చాల‌వు క‌దా.ఉద్యానవనానికి వెళ్లినప్పుడు మ‌న‌కు అక్క‌డ క‌నిపించే చెట్లు, పూలు మ‌న‌సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.

ప్ర‌శాంత మైన వాతావ‌ర‌ణం అంతా అక్క‌డే ఉందా అనేంత‌లా మ‌న‌సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అక్క‌డి పూల చెట్లు.స్వ‌చ్ఛ‌మైన గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు అనుకుంటాం.ఇక అంత అందమైన పూల‌ను చూశాక ఊరుకుంటామా వాటితో ఫొటోలు దిగాల‌ని అనిపిస్తుంది.వాటిని ప‌ట్టుకోవాల‌ని కోరిక పుడుతుంది.

క‌దా.అయితే ఇప్పుడు చెప్ప‌బోయేదాన్ని ముట్టుకుంటే మాత్రం ఇక అంతే సంగ‌తి.

ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే పూదోట బ్రిట‌న్ లోని నార్త్ అంబ‌ర్ లాండ్ లో ఉంది.దీని ప్ర‌త్యేకత ఏంటంటే ప్ర‌పంచంలోని అత్యంత ప్ర‌మాద‌క‌ర చెట్ల‌న్నీ కూడా ఇందులోనే ఉన్నాయి.ఇందులో ఏ ఒక్క పూల మొక్కను తాకినా లేదంటే క‌నీసం వాసన పీల్చినా చ‌నిపోవ‌డం ఖాయం.అందుకే ఇక్క‌డ అత్యంత క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఉంటుంది.ఇక్క‌డికి అనుమ‌తి లేకుండా పైగా నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా వెళ్తే ఇంక ప్రాణాల మీద ఆశ‌లు వ‌దులుకోవ‌డమే.ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube