ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో( Financial Problems ) బాధపడుతూ ఉన్నారు.కొంతమందికి సంపాదించే సోర్స్ లేక డబ్బు లేక బాధపడుతూ ఉంటారు.
ఇక మరికొందరేమో డబ్బు బానే సంపాదిస్తారు.కానీ వచ్చిన డబ్బంతా అదే దారిన వెళ్ళిపోతూ ఉంటుంది.
వారికి వచ్చే లాభం కన్నా పోయే లెక్క ఎక్కువ ఉంటుంది.దీంతో అప్పుల పాలవుతారు.
ఇలా తరచూ మీతో కూడా జరుగుతూ ఉంటే మీకు ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.అంటే వాస్తు దోషం( Vastu ) వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.
అందుకే ఇంట్లోని వస్తువులను వాస్తుకు అనుగుణంగా ఆయా దిశల్లో ఉంచితే అంతా మంచే జరుగుతుందని నిపుణులు అంటున్నారు.ముందుగా సంపద దేవుడైన కుబేరుని సంపన్నం చేసుకోవాలి.

సంపద దేవుడైన కుబేరుడు( Kuber ) మన్నించినప్పుడే అదృష్టం సంపద కురుస్తాయి.ఇక కుబేరునికి ఉత్తరం ఒక మంచి ప్రదేశం అందుకే ఉత్తరం దిక్కున ఎప్పుడు కూడా శుభ్రంగా, ఎనర్జిటిక్ గా, పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి.దీనివల్ల సంపద పెరగడానికి సహాయపడుతుంది.అలాగే ఈశాన్య దిశలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు.ముఖ్యంగా ఈశాన్య మూలన గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.ఆ దిశలో ఎటువంటి అడ్డంకులు ఉంచకూడదు.
చెత్తచెదారాలను కూడా ఉంచకూడదు.

ఎందుకంటే ఈశాన్య దిశ సిరి సంపదలకు అనుకూలిస్తుంది.అంతేకాకుండా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే ఇంట్లో పనికిరాని వస్తువులను, చెత్తాచెదారాలను కూడా ఉంచకూడదు.
ఇక ఇంటి ప్రధాన ద్వారానికి నేరుగా ఎలాంటి అడ్డంకులు ఉంచకూడదు.అలాగే నీటి ట్యాంకులు కూడా లేకుండా చూసుకోవాలి.
ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది.దీంతో ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది.
డబ్బుకు ఏ లేటు లేకుండా ఉంటుంది.అలాగే వాటర్ లీకేజ్ కూడా లేకుండా చూసుకోవాలి.
ఎందుకంటే నీరు వృధా అయిపోతే డబ్బు కూడా అలానే వృధా అయిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.కాబట్టి నీటిని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇలా చేస్తే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు.