చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..

సోషల్ మీడియాలో ఒక ఆవును రక్షించిన వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో, ఒక ఆవు రెండు చెట్ల మధ్య ఇరుక్కుంది, దాని మెడ గట్టిగా చిక్కుకుపోయి కదలలేకపోతుంది.

 Look How He Saved The Cow Stuck In The Tree Branches, Cow Rescue, Viral Video, A-TeluguStop.com

ఆ ఆవు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది, తనను తాను విడిపించుకోవడానికి కష్టపడుతోంది.ఆవు దుస్థితిని గమనించిన ఒక మనిషి చలించిపోయాడు.అతను వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.“నేచర్ ఇస్ అమేజింగ్”(Nature is Amazing) అనే X అకౌంట్‌లో పంచుకున్న ఈ వీడియో చాలా మంది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఆ ఆవును రక్షించిన ఆ మనిషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

వీడియోలో, ఆవు తప్పించుకోవడానికి కష్టపడుతుండటంతో చాలా ఒత్తిడికి గురైంది.

ఆ మనిషి దగ్గరకు వెళ్లి, ఆ ఆవును విడిపించడానికి ప్రయత్నించాడు.ఆవు మెడను బయటకు లాగడానికి వివిధ మార్గాలను ప్రయత్నించాడు అది కష్టమైనా సరే అతను ఓపికతో చాలా కేర్‌ఫుల్‌గా ఆవును విడిపించాడు.

చాలా ప్రయత్నాల తరువాత, అతను చివరకు విజయం సాధించాడు.విముక్తి పొందిన తరువాత, ఆవు (Cow)ప్రశాంతంగా, ఉపశమనంగా కనిపించింది.

ఆ క్షణం చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది.దయతో చిన్న పనులు చేసినా ప్రపంచంలో చాలా మంచి మార్పు వస్తుందని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో చూసిన ఒక యూజర్, “వెల్ డన్, హ్యూమన్! ఇది చాలా అవసరమైన సహాయం” అని రాశారు.మరొకరు, “ఇలాంటి దయ మానవజాతిపై నా నమ్మకాన్ని కలిగిస్తోంది.” అని అన్నారు.మరికొందరు ఆయనను ఆవును రక్షించినందుకు “దేవుడు” అని పిలిచారు.

కొంతమంది మాత్రం ఆవు ఆ రెండు చెట్ల మధ్యలో తన ముఖాన్ని ఎందుకు పెట్టిందో తెలియడం లేదు అని కామెంట్ పెట్టారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube