టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ రమ్య వ్యక్తిగత విషయాల గురించి తరచు వార్తలలో నిలుస్తున్నారు.రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకపోవడంతో నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే తనకు విడాకులు ఇప్పించాలని నరేష్ కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలోనే కోర్టులో నరేష్ రమ్య రఘుపతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రమ్య రఘుపతి పెట్టే టార్చర్ తాను భరించలేకపోతున్నానని తనకు విడాకులు ఇప్పించాలని ఈయన కోరారు.రమ్య రఘుపతితో తనకు 2010 సంవత్సరంలో వివాహం జరిగిందని 2012లో తనకు రణవీర్ జన్మించారని నరేష్ తెలిపారు.
ఇకపోతే రమ్య పెళ్లయిన కొన్ని నెలలకే తనను వేధించడం మొదలుపెట్టిందని నరేష్ తెలిపారు.ఆమెకు డబ్బు వ్యామోహం ఎక్కువ తనకు తెలియకుండా తన కుటుంబ సభ్యులలోను అలాగే కొన్ని బ్యాంకుల నుంచి భారీగా అప్పు చేసిందని తన అప్పును దాదాపు పది లక్షల వరకు తాను చెల్లించానని నరేష్ తెలిపారు.రమ్య రోహిత్ శెట్టితో కలిసి తనకు హాని తలపెట్టిందని గత ఏడాది ఏప్రిల్ నెలలో కొందరు అగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడికి ప్రయత్నించారని నరేష్ ఈ సందర్భంగా తెలిపారు.
కేవలం ఆస్తి కోసమే రమ్య రఘుపతి నన్ను చంపేయాలనుకుంది.అలాంటి తన వద్ద తన కుమారుడు పెరగడం తనకు ఇష్టం లేదని తన కుమారుడికి గార్డియన్ గా తానే ఉంటానని ఈ సందర్భంగా నరేష్ కోర్టును కోరారు.ప్రస్తుతం తన కుమారుడి చదువుల నిమిత్తం ఏడాదికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని నరేష్ తెలిపారు.
రమ్య రఘుపతి కారణంగా తన కుమారుడి జీవితం నాశనం అవుతుందని, అందుకే తన కుమారుడికి గార్డియన్ గా తానే వ్యవహరిస్తానంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి నరేష్ వ్యాఖ్యలపై రమ్య స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.