ఆ విషయం భగవంతుడికే తెలియాలి.... వారికి క్షమాపణలు చెప్పిన రష్మిక?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) అనంతరం తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు అయితే తెలుగులో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అయ్యాయి.ఇక అల్లు అర్జున్( Allu Arjun) తో కలిసి రష్మిక నటించిన పుష్ప సినిమా (Pushpa ) పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Rashmika Gives Her Health Update After Leg Injury , Rashmika, Leg Injury, Pain,-TeluguStop.com

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇక ఇటీవల రష్మిక పుష్ప 2(rashmika pushpa 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

దీంతో ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

అయితే ఇటీవల ఈమె కాలికి గాయమైంది(Leg Injury)అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఈ విషయం గురించి స్వయంగా రష్మిక మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

Telugu Leg Injury, Pain, Pushpa, Rashmika, Rashmika Pushpa, Tollywood-Movie

ఈ క్రమంలోనే తన కాలికి బ్యాండేజ్ వేసి ఉన్నటువంటి ఫోటోని రష్మిక షేర్ చేస్తూ.హ్యాపీ న్యూ ఇయర్ నొప్పితో(Pain) మొదలైందని, అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియక ఆశతో ఉన్నాను.ప్రస్తుతం నేను ఆశ మోడ్ లో ఉన్నానని తెలిపారు.

వారాలు లేదా నెలలు పట్టవచ్చు, దేవునికి మాత్రమే తెలుసు.నేను ఇప్పుడు థమ, సికందర్, కుబేర షూటింగ్ సెట్స్‌కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను.

ఆలస్యానికి దర్శకులు నన్ను క్షమించాలని నొప్పి తగ్గిన వెంటనే తాను తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటాను అంటూ ఈ సందర్భంగా రష్మిక తనకు జరిగిన కాలు ప్రమాదం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube