వారానికి ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం, చుండ్రు అన్నీ పరార్!

మీ జుట్టు రోజురోజుకు విపరీతంగా రాలిపోతుందా.? ఎంత ప్రయత్నించినా హెయిర్ ఫాల్( Hair fall ) కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా.

? దీనికి తోడు చుండ్రు ( Dandruff )కూడా మదన పెడుతుందా.? వీటిని వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేసి విసిగిపోయారా.? డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే విధంగా వారానికి ఒక్కసారి షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం, చుండ్రు తదితర సమస్యలన్నీ పరార్ అవ్వాల్సిందే.

మరి ఇంకెందుకు ఆలస్యం షాంపూ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండున్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బియ్యాన్ని వేసుకోవాలి.అలాగే నాలుగు తుంచిన మందారం ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు కుంకుడుకాయ పొడి( Saffron powder ) వన్ టేబుల్ స్పూన్ శీకాకాయ పొడి వేసి దాదాపు ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement

ఈ వాటర్ ను చల్లార పెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఇలా హెర్బల్ హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

హెయిర్ ఫాల్ అనేది ఎంత తీవ్రంగా ఉన్నా సరే చాలా త్వరగా అదుపులోకి వస్తుంది.అలాగే తలలో చుండ్రు రెండు మూడు వాషుల్లోనే పూర్తిగా మాయం అవుతుంది.

అంతేకాదు, ఇప్పుడు చెప్పుకున్న విధంగా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.కురులు దృఢంగా మారతాయి.జుట్టు చిట్లడం విరగడం వంటివి తగ్గుతాయి.

మరియు కురులు షైనీ గా మెరుస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా హెయిర్ వాష్ చేసుకునేందుకు ప్రయత్నించండి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు