చరణ్ ను కలవడానికి వెళ్లిన అభిమానులు... కడుపునిండా భోజనం పెట్టి పంపిన హీరో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని అభిమానులను సందడి చేస్తుంది.

 Ram Charan Arranged Food To All The Fans Who Came To Congratulate Him , Ram Char-TeluguStop.com

రామ్ చరణ్ సోలో హీరోగా(solo hero Ram Charan) ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు ఆరు సంవత్సరాలవుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రావడంతో అభిమానులు కొందరు హైదరాబాదులోనే రామ్ చరణ్ నివాసం వద్దకు వెళ్లారు.

ఇలా చరణ్ ఇంటి వద్దకు వెళ్లిన అభిమానులు ఆయనని కలిసి సినిమా మంచి విజయం సాధించినందుకు చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని చెప్పాలి.ఇలా అభిమానులు రామ్ చరణ్ ని కలవడానికి వెళ్లడంతో చరణ్ స్వయంగా అభిమానులతో(Fans) కాసేపు మాట్లాడి వారిని సంతోష పెట్టడమే కాకుండా వారందరికీ కూడా వివిధ రకాల భోజనాలను (Food) తయారు చేయించి కడుపునిండా భోజనం పెట్టి పంపించారు.

Telugu Charanprabhas, Fans, Game Changer, Prabhas, Ram Charan, Solo Ram Charan-M

ఇలా తమ అభిమాన హీరోని కలవడానికి వెళ్లడంతో ఆయన వారి గురించి ఆలోచించి వివిధ రకాల భోజనాలను తయారు చేయించి భోజనం పెట్టి పంపించడంతో అభిమానులు చరణ్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఎంతైనా చరణ్ ప్రభాస్ ఫ్రెండే (Charan Prabhas Friend)కదా అందుకే ప్రభాస్(Prabhas) అలవాట్లే ఈయనకు కూడా వచ్చాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రభాస్ ఎవరు వెళ్లిన కడుపునిండా భోజనం పెట్టనిదే బయటకు పంపించరు అదే విధంగా చరణ్ కూడా అభిమానుల గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube