అక్రమ వలసదారుల ఏరివేత .. యాక్షన్‌లోకి ట్రంప్, గురుద్వారాలలో యూఎస్ ఏజెంట్ల తనిఖీలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) పగ్గాలు అందుకున్న తర్వాత చెప్పినట్లుగానే అక్రమ వలసదారులపై( Illegal Migrants ) ఉక్కుపాదం మోపుతున్నారు.ఇప్పటికే అమెరికాలోని విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: యూఎస్ పౌరసత్వం రాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు ట్రంప్.దీనిని ప్రస్తుతానికి కోర్టులు అడ్డుకున్నా.ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.మరోవైపు.దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు భారీ ఆపరేషన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 Illegal Immigrants In America Us Agents Visit Sikh Gurdwaras In New York New Jer-TeluguStop.com

తాజాగా అక్రమ వలసదారులను తనిఖీ చేసేందుకు గాను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ( US Department of Homeland Security ) అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలలోని సిక్కు గురుద్వారాలలో( Sikh Gurdwaras ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.కొన్ని సిక్కు సంస్థలు ఇటువంటి చర్యలు తమ మత విశ్వాసాలు, పవిత్రతకు ముప్పుగా భావిస్తున్నాయి.

న్యూయార్క్,( New York ) న్యూజెర్సీ( New Jersey ) రాష్ట్రాలలో ఉన్న కొన్ని గురుద్వారాలను సిక్కు వేర్పాటువాదులు, అక్రమ , పత్రాలు లేని వలసదారులు కేంద్రంగా ఉపయోగిస్తున్నారని అక్కడి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Telugu America, Jersey, York, Sikh Gurdwaras, Donald Trump-Telugu NRI

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిగంటల్లోనే హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ సెక్రటరీ బెంజమిన్ హాఫ్‌మన్( Benjamine Huffman ) కీలక ఆదేశాలు జారీ చేశారు.సున్నితమైన ప్రాంతాలుగా పేర్కొన్న ప్రదేశాల్లోకి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ), కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)లను అడ్డుకునేలా గతంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేశారు.

Telugu America, Jersey, York, Sikh Gurdwaras, Donald Trump-Telugu NRI

ఈ సున్నితమైన ప్రాంతాలలో గురుద్వారాలు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.అయితే తాజాగా హాఫ్‌మన్ జారీ చేసిన ఆదేశాలపై సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్డీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.గురుద్వారాలు కేవలం ప్రార్ధనా స్థలాలు మాత్రమే కాదని.

అవి సిక్కులకు, సమాజానికి మద్ధతు, పోషణ, ఆధ్యాత్మిక ఓదార్పునిచ్చే కీలకమైన సమాజ కేంద్రాలు అని ఫండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube