బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునే సుదీర్ఘ ప్రేమ తర్వాత ఇటీవలే ఒక్కటైన విషయం తెల్సిందే.వీరిద్దరు కలిసి ప్రస్తుతం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
పెళ్లి తర్వాత తన భర్త చాలా గొప్ప వాడు, చాలా మంచి వాడు అంటూ చెప్పుకుంటూ ఉంటారు.అయితే తాజాగా దీపిక మాత్రం తన భర్త చాలా లేట్ పర్సన్ అంటూ చెప్పి రణ్ వీర్ సింగ్ పరువు తీసింది.
తాజాగా ఒక అవార్డు ఫంక్షన్‌లో దీపిక మాట్లాడుతూ సరదాగా తన భర్త లేట్ అంటూ చెప్పింది.

పెమినా అవార్డు వేడుకలో దీపిక పాల్గొంది.ఆ సమయంలో మీ భర్త రణ్‌వీర్ సింగ్‌లో మీకు చిరాకు కలిగించే విషయం ఏంటీ, ఎవరికి తెలియని విషయం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో దీపిక స్పందిస్తూ తన భర్త ప్రతి విషయంలో కూడా చాలా ఆలస్యం.స్నానం చేయాలంటే గంట టైం తీసుకుంటాడు, ఇక డ్రస్సింగ్ టేబుల్ ముందు చాలా సమయం గడుపుతాడు.

చివరకు బెడ్ మీదకు వచ్చేందుకు కూడా చాలా ఆలస్యం చేస్తాడంటూ నవ్వుకుంటూ చెప్పింది.ప్రతి విషయంలో కూడా ఎక్కువ సమయం తీసుకోవడం ఆయనకు అలవాటు అని, అయితే నేను మాత్రం మరీ అలా కాదు.ప్రతి పనిని ఫటా ఫటా అంటూ ముగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
పెళ్లి తర్వాత రన్ వీర్ సింగ్ లక్ బాగా కలిసి వచ్చినట్లుగా అనిపిస్తుంది.గత ఏడాది పద్మావత్‌తో సూపర్ హిట్‌ను దక్కించుకున్న రణ్‌వీర్ సింగ్ తాజాగా ‘సింబా’ చిత్రంతో ఏకంగా 250 కోట్ల వసూళ్లను నమోదు చేశాడు.

ఇక ఇటీవలే విడుదలైన ‘గల్లీ బాయ్’ చిత్రంతో కూడా సూపర్ హిట్‌ను అందుకున్నాడు.హీరోగా సూపర్ హిట్స్ అందుకుంటూ సూపర్ స్టార్ క్రేజ్‌ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న రణ్‌వీర్ సింగ్ భార్య దీపిక మాటలతో గాలితీసినట్లుగా అయ్యింది.దీపిక మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవుతున్నాయి.
పొరపాటున దీపిక నోరు జారడంతో ఇప్పుడు వింత వింత మీమ్స్ వస్తున్నాయి.