రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం గ్రామపంచాయితీ కార్యాలయం ఆవరణలో గ్రామ ఉపసర్పంచ్, పాలకవర్గం,ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మమత రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇంతకు ముందు స్థానిక గ్రామంచాయతీ ఎదురుగా గల శివాలయం లో ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు స్థానిక పురోహితులు రాచర్ల హనుమాండ్లు పంతులు చేత ప్రత్యేక పూజలు గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యులు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ తో పాటు వార్డు సభ్యులు డ్యాగం లక్ష్మీ నారాయణ,రేసు బాబాయ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు ఎనగందుల బాబు, నాయకులు గుంటుక రవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజు,గ్రామ పంచాయితీ సిబ్బంది కటకం రామచంద్రం, బిల్ కలెక్టర్ నవీన్ భాగ్య,చందనం మల్లేశం,ఆటో యూనియన్ సభ్యులు 100 మందికి పైగా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఉపసర్పంచ్, పాలకవర్గం సభ్యులు, ఆటో యూనియన్ సభ్యులకు సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి దంపతులు ధన్యవాదాలు తెలిపారు.







