Holli Festival : హోలీ పండుగకు ముందు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం ఖాయం..!

హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ( Holli ) దహన కార్యక్రమం ప్రదోషకాల సమయంలో పాల్గుణ పూర్ణిమ రోజున జరుగుతుందని పండితులు చెబుతున్నారు.మర్నాడు రంగులతో ఆడుకుంటారు.

 If You Buy These Items And Bring Them Home Before The Festival Of Holi You Are-TeluguStop.com

హిందూమతంలో హోలీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.మంచి చెడు పై సాధించిన విజయం గా ప్రతి ఏడాది హోలీ పండుగను జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం హోలీ రోజున కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుంది.

జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో విజయం సాధించలేక పోవడం లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఇంట్లో వాస్తు దోషం ఉండవచ్చు.

Telugu Aquarium, Bamboo, Goddess Lakshmi, Holi, Buyitems-Latest News - Telugu

దీన్ని నివారించడానికి ఇంటి గుమ్మాన్నీ అందమైన తోరణాలతో అలంకరించాలి.ఇంటి ప్రధాన తలుపుకు వేలాడదీయాలి.అంతే కాకుండా చాలా అందంగా కూడా కనిపిస్తుంది.కుబేరుడి ప్రదేశంగా భావించే ఇంటి ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో అక్వేరియం( Aquarium ) ఉండేలా చూసుకోవాలి.ఇది ఇంటికి ఆనందాన్ని కచ్చితంగా తీసుకొని వస్తుంది.అలాగే ఇంట్లోకి సంపద రావడానికి ఖచ్చితమైన మార్గం ఏర్పడుతుంది.

హోలీకి ముందు రోజు ఖచ్చితంగా ఇంటికి వెదురు మొక్కను తీసుకురావాలి.వెదురు మొక్క ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది.

దీంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది.ప్రజలు తరచుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే హోలీ రోజున వెండి నాణెం కొని ఇంటికి తీసుకురావాలి.

Telugu Aquarium, Bamboo, Goddess Lakshmi, Holi, Buyitems-Latest News - Telugu

కొన్ని రోజులు ఇలా చేయడం వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు( Financial problems ) దూరం అవుతాయి.అలాగే ఈ వెండి నాణాన్ని ఎరుపు లేదా పసుపు గుడ్డలో చుట్టి దాని పై పసుపు రాసి భద్రంగా ఉంచాలి.ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.తర్వాత హోలీ మంట నుంచి వచ్చిన బూడిదను ఇంటికి తీసుకువచ్చి ప్రతి ఇంటి ప్రతి భాగంలో చల్లాలి.

అలాగే హోలీ రోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాలు కట్టాలి.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube