తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
తాజాగా ప్రసాద్ తల్లి టీజీ గీతాంజలి.( TG Geethanjali ) ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పలువురిసిన ఈ ప్రముఖులు ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు.
తాజాగా నిన్న సాయంత్రం 6:10 నిమిషాలకు ఆమె మరణించారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతిన్నారు.
కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆమె చివరి కోరిక మేరకు కొడుకు విశ్వప్రసాద్ వారణాసికి ( Varanasi ) తీసుకొని వెళ్లారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత దైవ దర్శనం చేసుకుని అనంతరం ఆమె తదిశ్వాస విడిచారు.టీజీ విశ్వప్రసాద్ గీతాంజలి పెద్దకొడుకు.తల్లి కోరిక మేరకు వారణాసిలోనే తన తల్లి అంత్యక్రియలు జరగనున్నట్లు ప్రసాద్ వెల్లడించారు.
ఇకపోతే టీజీ విశ్వప్రసాద్ విషయానికి వస్తే.సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేతగా టీజీ విశ్వ ప్రసాద్ ఎన్నో చిత్రాలను ప్రేక్షకులను అందిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.
ఓకేసారి పదుల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు.టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్న విషయం తెలిసిందే.
ఇక విశ్వ ప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై వరుస బెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.కాగా టీజీ ప్రసాద్ వీలైనంత తొందరగా తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి వంద సినిమాలు నిర్మించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.ప్రస్తుతం నిర్మించే చిత్రాల్లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో పాటు ప్రభాస్, మారుతి సినిమా కూడా ఒకటి.కాగా మును ముందు తమ బ్యానర్ లో హాలీవుడ్ సినిమాలు కూడా నిర్మించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రొడక్షన్ హౌజ్ తో పాటు టీజీ విశ్వ ప్రసాద్ కు యూఎస్‌లోనూ పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి.